27, జూన్ 2011, సోమవారం

వేపవిత్తనాలు - లెక్కలు



మానవ పరిణామక్రమంలో ఏమేమి మార్పులు జరిగాయోగాని, ఒక్కోసారి ఈ చిన్నపిల్లల్లో వాళ్ళకై వాళ్ళే కొత్తవిషయాలను నేర్చుకోవటానికి వినూత్న మార్గాలను వెతుక్కుంటుంటారు. పల్లెటూళ్ళలో ప్రకృతి వడిలో నుండి వాళ్ళేంచుకునే సహజసిద్దమైన పద్దతులను చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంది.

కొండాపురం మండలం, కొత్తపాళెం గ్రామంలో మనీల్ అనే ఐదు సంవత్సరాల కుర్రవాడు అటువంటి తమాషా పద్దతినే ఎంచుకున్నాడు. వేపచెట్లకింద వేపకాయలను ఏరుకుంటూ ఒంట్లు (1,2,3,...) లెక్కబెట్టటంలో ప్రావీణ్యత సాధించాడు. ఈ విద్యార్ధిని అలాగే ప్రోత్సహించడంతో కొద్ది రోజులలోనే నోటి లెక్కలు చిన్నచిన్నవి నేర్చుకున్నాడు. 18+17 ఎంత అంటే 35 అని ఠక్కున చెప్పగలిగేవాడు. మూడంకెల కూడికలు, తీసివేతలు నోటి లెక్కలుగా చెప్పే స్థితికి ఎదిగాడు.

ఇది చాలా చిన్న విషయమే కదూ??

ఏక సంధాగ్రాహి

అది 2000 సంవత్సరం, ఊరు లింగంగుంట, కావలి మండలం. అదో చిన్న పల్లెటూరు. ఒక నిరుపేద కుటుంబం నుండి ఒక చిన్న పిల్లవాడు ఒకటవ తరగతిలో మా పాఠశాలలో చేరాడు. చేరిన మూడునెలలలో ఒకటవ తరుగతి పూర్తి చేసి మమ్మల్ని ఆశ్చర్య పరిచాడు. సార్! నాకు ఈ పుస్తకం వద్దు, వేరే పుస్తకం కావాలని అడిగాడు ఒక రోజు. వాడి ఉత్సాహం చూసి రెండవ తరుగతి పుస్తకాన్ని ఇచ్చాను. నెలలో దాన్నీ పూర్తిచేసేశాడు. అలా అలా రెండవ తరుగతిలో పదవ తరుగతి పుస్తకాన్ని చదివి, మేమడిగన ప్రశ్నలకు సరిగ్గా సమధానం చెప్పేవాడు. అదేగాక ఆ పుస్తకాన్ని గడ గడ వప్ప చెప్పేసేవాడు. అంటే వాడో ఏక సంధాగ్రాహి అన్నమాట. ఏ పుస్తకాన్నయినా ఇస్తే, ఆ విద్యార్ధి దాన్ని చదివి, తిరిగి నోటుపుస్తకంలో పూర్తిగా వ్రాసుకుని చదివి ఆ తరువాత అప్పజెప్పేవాడు. రెండవ తరుగతిలో నెల్లూరు పట్టణానికి వెళ్ళీ "అంబేద్కర్ జీవిత చరిత్ర" వ్యాస రచన మరియు వ్యక్తృత్వ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచాడు. ఆ చిన్ని విద్యార్ధి పోటీ పడింది ఎవరితో తెలుసా?? 8,9,10 తరగతి విద్యార్ధులతో. అదే విధంగా ఐక్యరాజ్య సమితి దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి గురించి అనర్గళంగా 5 నిమిషాలు మాట్లాడి అబ్బురపరిచాడు.

ఆ విద్యార్ధి పేరు అనపల్లి సుమంత్. ఆ చిన్నప్పటి ఏకసంధాగ్రాహి ఇప్పుడేమి చేస్తున్నాడోనని మీకు ఆసక్తిగా ఉంది కదూ. స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్సీ లో ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు ఫో యిన  సంవత్సరం వాళ్ళ ఊ రికి వేళితే పిలిపించినా రాలేదు నాకు అర్ధం కాలేదు. మీరు చాలా ఆస క్తిగా ఉంది కదూ. బిటేక్  రెండవ సంవత్సరం  చదువు తున్నాడు...... ఫా పం మరిచి పోయి  ఉండవచ్చు...